దుబ్బాకటౌన్: జాతీయ స్థాయి కరాటే పోటీల్లో దుబ్బాక పట్టణానికి చెందిన విద్యార్థులు సత్తాచాటారు. హైదరాబాద్ కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నాయకయమా షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన 2వేల మంది విద్యార్థులు పాల్గొన్నట్లు కరాటే మాస్టర్ శ్రీకాంత్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ పోటీల్లో దుబ్బాక పట్టణానికి చెందిన విద్యార్థులు ఆరావ్, సర్వజ్ఞ, ప్రణవి, అఖిల్, రిస్విత, శిల్పిత, శ్రియన్స్ గోల్డ్ మెడల్స్ సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులు, యువర్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ ఫౌండర్ అండ్ డైరెక్టర్ కరాటే మాస్టర్ శ్రీకాంత్, రేంజుకి షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఇండియా వ్యవస్థాపకులు మాస్టర్ నగేశ్, జనరల్ సెక్రెటరీ నవీన్ కుమార్ అభినందించారు.


