● కలెక్టర్ హైమావతి ● వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్
సిద్దిపేటరూరల్: గౌరవెల్లి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని కలెక్టర్ కె. హైమావతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, ఉన్నతాధికారులకు తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టులపై భారీనీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నంప్రభాకర్‌లు, ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. అదేవిధంగా తపాస్‌పల్లి రిజర్వాయర్‌లో పెండింగ్ భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


