హసన్‌మీరాపూర్‌లో సంబరాలు
దుబ్బాక: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)సభ్యుడిగా జి.కిరణ్‌కుమార్ సోమవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించడంతో స్థానికంగా సంబరాలు అంబరాన్నంటాయి. దుబ్బాక మండలం హసన్‌మీరాపూర్‌కు చెందిన బాలకిషన్‌రావు, రాధ దంపతుల కుమారుడు కిరణ్‌కుమార్ బీసీఐ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టడటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కిరణ్‌కుమార్ 25 ఏళ్లుగా హైదరాబాద్‌లో ప్రముఖ క్రిమినల్ లాయర్‌గా పనిచేస్తున్నారు. ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కిరణ్‌కుమార్ గ్రామానికి వచ్చినప్పుడు అందరితో కలిసి ఆప్యాయంగా ఉండేవారని స్థానికులు తెలిపారు. గ్రామంలో పాఠశాల అభివృద్ధితో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఆయన బీసీఐ సభ్యుడిగా నియామకం కావడం తో గ్రామానికి ఢిల్లీ స్థాయిలో గుర్తింపు వచ్చిందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.


