వైద్య విద్యార్థికి మాజీ మంత్రి హరీశ్‌రావు సాయం
సిద్దిపేటజోన్: ఎంబీబీఎస్ సీటు సాధించిన పేద విద్యార్థికి ఇచ్చిన మాట మేరకు శనివారం మాజీ మంత్రి హరీశ్‌రావు ఆర్థికసాయం అందించారు. జిల్లా కేంద్రానికి చెందిన అఖిల అనే పేద విద్యార్థి ఇటీవల నీట్ ర్యాంక్ సాధించింది. వైద్య విద్య కోసం అండగా ఉండాలని కోరుతూ తల్లిదండ్రులతో హరీశ్‌రావును కలవడంతో ప్రభుత్వ కళాశాలలో సీటు వచ్చాక ఐదేళ్ల ఫీజు బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అఖిలకు ఎమ్మెల్యే హరీశ్‌రావు మొదటి ఏడాది ఫీజు ఖర్చుల కోసం రూ.70వేలు ఆర్థికసాయం అందించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రైమ్ గార్డెన్స్‌లో ట్రెస్మా ఆధ్వర్యంలో జరిగిన గురుపూజోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, ట్రెస్మా అధ్యక్షుడు భాస్కర్, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


