కాంగ్రెస్‌ సర్కార్‌ చేసింది శూన్యమే.. | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ సర్కార్‌ చేసింది శూన్యమే..

Sep 20 2026 7:42 AM | Updated on Sep 20 2026 7:42 AM

ఎంపీ రఘునందన్‌ రావు

ఎంపీ రఘునందన్‌ రావు

సిద్దిపేటజోన్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం మాటల్లో తప్ప చేసింది ఏమీ లేదని ఎంపీ రఘునందన్‌ రావు విమర్శించారు. శనివారం రాత్రి స్థానిక విపంచి ఆడిటోరియంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్‌)ఆధ్వర్యంలో గురువందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంపీ హాజరై మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 317జీఓ ద్వారా ఇబ్బందులు పెట్టిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత జీఓ చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చి అమలులో విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే జీఓ 119 అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పీఆర్సీ అంశంపై సీఎం రేవంత్‌ రెడ్డి త్వరగా నిర్ణయించాలని సూచించారు. తపస్‌ పోరాటంలో తన వంతు పాత్ర ఉంటుందన్నారు. మిగతా అన్ని వృత్తుల కంటే భిన్నంగా ఉండేది ఉపాధ్యాయ వృత్తి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 80మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement