సన్మానించిన ఆలయ కమిటీ సభ్యులు
నంగునూరు(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో రాంపూర్‌లో నెలకొల్పిన వినాయక విగ్రహానికి శనివారం ముస్లిం దంపతులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామానికి చెందిన ఎండీ గఫూర్ ఉత్సవ కమిటీ సభ్యుడిగా ఉంటూ ప్రతి యేట నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేవారు. ప్రస్తుతం అతనికి వివాహం కావడంతో తన భార్య షబానాతో కలసి పూజలో పాల్గొన్నారు. అందరిలాగానే స్వామివారి మండపంలో కూర్చొని ఇంట్లో తయారు చేసిన లడ్డూ, పులిహోర, పండ్లను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు గఫూర్ దంపతులను శాలువాతో సత్కరించి ప్రసాదం అందజేశారు.


