● మెదక్, నిజామాబాద్ ఎంపీలు ఫైర్ ● బీజేపీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా
సిద్ధిపేటజోన్: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలకు ముందే 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న కోటి ఎకరాలను తొలగించాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో అసెంబీ ముట్టడిస్తామని ఎంపీ రఘునందన్‌రావు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ హాజరయ్యారు. రఘునందన్ రావు మాట్లాడుతూ.. 22ఏ రద్దు చేయకుంటే సిద్దిపేట కలెక్టరేట్ నుంచి అసెంబ్లీ వరకు బీజేపీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఏడాది దాటితే కాంగ్రెస్ పార్టీలో ఒక్క లీడర్ ఉండరని, దుకాణం ఖాళీ అవుతుందని జోస్యం పలికారు. అంతకుముందు ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే ముస్లిం అని రెండు ఒక్కటేనని ఆరోపించారు. ధర్నాకు పలువురు న్యాయవాదులు మద్దతు పలికారు. కాగా బీఆర్‌ఎస్ వారు రఘునందన్‌రావు దోస్తులు అని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించడంతో పలువురు చర్చించుకోవడం కనిపించింది.


