కూలీలు రావడం లేదు | - | Sakshi
Sakshi News home page

కూలీలు రావడం లేదు

Sep 1 2026 7:41 AM | Updated on Sep 1 2026 7:41 AM

ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటైనప్పటి నుంచి దుమ్ము, దుర్వాసన వస్తోంది. వ్యవసాయ పనులకు కూలీలు కూడా రావడం లేదు. ఫ్యాక్టరీ నుంచి వ్యర్థజలాలు బయటకు వస్తుండటంతో పంటల దిగుబడి తగ్గుతోంది. అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. పరిశ్రమలకు అధికంగా నీటిని వినియోగించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయనే ఆందోళన ఉంది.

– జట్టి శ్రీనివాస్‌, రైతు, దాచారం

విషతుల్యమవుతున్నాయి

ఐదు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. ఇథనాల్‌ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న కలుషిత నీటిని తోటపల్లి చెరువులోకి వచ్చే కాలువలో వదులుతున్నారు. దీంతో చేపలు మృత్యువాత పడ్డాయి. కలుషిత నీటితో పంటలు పండించడం అంటే విషతుల్యమైన ఆహారాన్ని అందించడమే. ఫ్యాక్టరీ అనుమతులను వెంటనే రద్దు చేయాలి.

– గాజే రాజు, రైతు, దాచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement