● మాజీ మంత్రి హరీశ్‌రావు ● బీఆర్‌ఎస్‌లో చేరిన వర్గల్ వార్డు సభ్యులు
సిద్దిపేటజోన్: మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం గజ్వేల్ నియోజకవర్గ వర్గల్ గ్రామ వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. హరీశ్‌రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


