ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం

Aug 30 2026 7:24 AM | Updated on Aug 30 2026 7:24 AM

బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రతాప్‌రెడ్డి గజ్వేల్‌లో ముఖ్యనాయకుల సమావేశం

గజ్వేల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపకు తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శనివారం గజ్వేల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టి 1000 రోజులవుతుండగా, అన్ని రంగాల్లో వైఫ్యలాలను మూటగట్టుకున్నారని మండిపడ్డారు. వచ్చే నెల 2 నుంచి 8వరకు ప్రజలను చైతన్యపరిచేందుకు కార్యక్రమాలను చేపడతామన్నారు. ప్రజలకిచ్చిన హామీలపై నిలదీస్తూ బాకీ కార్డులను పంపిణీ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా గాంధీ, అంబేద్కర్‌ విగ్రహాలకు ప్రభుత్వ వైఫల్యాలపై వినతి పత్రాలను అందజేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్‌ తీసుకొచ్చిన పథకాలను ఒక్కొక్కటిగా నీరుగార్చే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్‌ అందజేయడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. ఇప్పటికై నా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోతే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement