కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమం ఎంతో కీలకమని కలెక్టర్ హైమావతి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హలులో పలు అంశాల పైన ఆర్డీవోలు, తహసీల్దార్లతో జూమ్ సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి రీ–సర్వే ప్రక్రియ నిర్ణీత కాలవ్యవధిలోపు పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో రీ–సర్వే లో సర్వే అధికారులు, తహసీల్దార్లు, గ్రామ సభలు నిర్వహించి అందరూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కార ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సాదబైనామా అప్లికేషన్లు పూర్తిగా వెరిఫై చేసుకొని, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చెక్ చేసుకోవాలన్నారు. 22(ఏ) నాన్ అగ్రికల్చర్ సంబంధించిన వాటిని కరెక్ట్‌గా పరిశీలించాలని తహసిల్దార్ లను, ఆ రిపోర్ట్‌లను ఆర్డీఓ పూర్తిగా చెక్ చేశాకే కలెక్టరేట్‌కి పంపించాలని ఆదేశించారు.


