● మంత్రి పొన్నం ప్రభాకర్ ● 250 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనుల పరిశీలన
హుస్నాబాద్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్‌లో కొత్తగా నిర్మిస్తున్న 250 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులను సోమవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిర్దేశిత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. 250 పడకల ఆస్పత్రి భవనం పూర్తయితే ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు మరింత చేరువకానున్నాయని మంత్రి తెలిపారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వడ్డెపల్లి వెంకట రమణ, కౌన్సిలర్లు ఉన్నారు.


