గడువులోగా చేయాలని కోరాం
అమృతం..
నత్తనడకన అమృత్ 2.0 పనులు
జిల్లాలోని గజ్వేల్–ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, చేర్యాల మున్సిపాలిటీల్లో కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన అమృత్–2.0 పథకం పనులు సాగుతున్నాయి. గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌లో రూ.28కోట్లు, సిద్దిపేటలో రూ.85కోట్లు, చేర్యాలలో సుమారు రూ.9కోట్లు ఈ పథకం కింద వెచ్చిస్తున్నారు. పట్టణాల్లో దాహార్తి సమస్య శాశ్వత పరిష్కారమే ఈ పనుల లక్ష్యం. ఏడాదిన్నర కిందట ప్రారంభమైన పనులు ఆగుతూ..సాగుతున్నాయి. ఆయా పట్టణాల్లో మంచినీటి సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం, కొత్తకాలనీలకు పైప్‌లైన్ల విస్తరణ, కొత్త నల్లా కనెక్షన్లు, వాటర్ మీటర్ల ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నారు.
మార్చి 2027 డెడ్‌లైన్
మున్సిపాలిటీల్లో అమృత్–2.0 పనులు నత్తనడకన సాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, కాంట్రాక్టర్లు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఈ అంశంపై ఇటీవలే హైదరాబాద్‌లో ఓ ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా పట్టణాల్లో ఎట్టి పరిస్థితుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు డెడ్‌లైన్ విధించారు. గడువులోగా పనులు పూర్తి చేయకపోతే నిధులు ల్యాప్స్ చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. కానీ క్షేత్రస్థాయిలో పనులు తీరు పరిశీలిస్తే గడువులోగా పనులు జరగటం అనుమానంగా మారింద. గజ్వేల్ పట్టణంలో భారత్‌నగర్, రాజిరెడ్డిపల్లి, సంగాపూర్‌ల వద్ద 25లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం జరుగుతోంది. అంతేకాకుండా కొత్త కాలనీలకు మంచినీటి సరఫరా వ్యవస్థను తీసుకొచ్చేందుకు 15కిలోమీటర్ల మేర పైప్‌లైన్ల నిర్మాణం పనులు కొనసాగుతున్నది. ఈ పనులు 70శాతానికిపైగా పూర్తి చేశామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కానీ పైప్‌లైన్‌ల పనులు కొంతవరకు పూర్తయినా, ఇంకా ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు. ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం పూర్తి కాలేదు. పైప్‌లైన్‌ల కోసం రహదారులపై గుంతలు తవ్వి అలాగే వదిలేయడం వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. మరోవైపు నెలల తరబడి పనులు పెండింగ్‌లో ఉన్నాయి. సిద్దిపేట, చేర్యాల మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.
మున్సిపాలిటీల్లో నత్తనడకన సాగు..తున్న అమృత్ 2.0 పనులు పూర్తి చేయడానికి ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఈ పనులను ఎట్టిపరిస్థితుల్లో 2027మార్చిలోగా పూర్తి చేయాలని ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయించారు. సకాలంలో పూర్తి చేయకపోతే నిధులు ల్యాప్స్ చేస్తామని కూడా హెచ్చరించినట్లు తెలిసింది. కానీ క్షేత్రస్థాయిలో పనుల తీరు చూస్తే గడువులోగా పూర్తికావడంపై సందేహం నెలకొంది. – గజ్వేల్
పట్టణంలో అమృత్–2.0 పనులను గడువులోగా పూర్తి చేయాలని పనులు చేపడుతున్న పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులను కోరాం. ప్రస్తుతం చాలా చోట్ల పనులు పెండింగ్‌లో ఉన్న విషయం చెప్పాం. స్పందించి పనులు పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.
– గణేశ్‌రెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్
మున్సిపల్ కమిషనర్


