అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, అనురాగానికి, ఆప్యాయతలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రజలు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచే తమ తోబుట్టువులకు సోదరీమణులు రాఖీలు కట్టారు. అనంతరం ఆశీర్వాదాలు తీసుకున్నారు. వివిధ రాజకీయ నాయకులకు, పార్టీ కార్యకర్తలు, అధికారులకు రాఖీలను కట్టారు. జిల్లా కేంద్రంలోని మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం, సామూహిక జంధ్యధారణ తదితర కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం శివపార్వతులు, మార్కండేయ స్వామివారి ఉత్సవ విగ్రహాలను పట్టణంలో ఊరేగించారు.
– ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)


