పుష్పాలే..
హుస్నాబాద్: ప్రకృతి సిద్ధంగా లభించే పంచపాండవుల పుష్పాలతోనే ప్రతిఏటా ఆ కుటుంబం రక్షాబంధన్ జరుపుకొంటోంది. ఈసారి కూడా ఆ పుష్పాలతోనే రక్షాబంధన్ పండుగను సంతోషంగా జరుపుకొన్నారు. హుస్నాబాద్‌లోని ఆరపల్లెకు చెందిన దొంతరబోయిన అయిలయ్య నర్సరీ పెంచుకుంటున్నారు. నర్సరీలో తీరొక్క కూరగాయలు, పండ్లు, పూలు మొక్కలు ఉన్నాయి. 22 ఏళ్లుగా తన నర్సరీలో ప్రకృతి సిద్ధంగా పూసిన పంచపాండవుల పుష్పాలను రాఖీలుగా తన అక్కాచెల్లెళ్లు కడుతున్నారు. రాఖీ మాదిరిగానే పంచపాండవుల పుష్పం ఉండటం విశేషం. మార్కెట్‌లో రెడీమేడ్‌గా లభించే రాఖీల కంటే పంచపాండవుల పుష్పాన్ని రాఖీగా కట్టుకోవడం శ్రేయస్కరంగా భావిస్తున్నారు. ఇలా పుష్పాన్ని రాఖీగా కట్టుకోవడం దేవుడిచ్చిన వర మని అయిలయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


