సంక్షోభంలో గురుకులాలు | - | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో గురుకులాలు

Jul 28 2026 7:08 AM | Updated on Jul 28 2026 7:08 AM

నాణ్యమైన విద్య, ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలం

బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): కేసీఆర్‌ హయాంలో సంక్షేమంగా ఉన్న గురుకులాలు నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని బీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి రేవంత్‌ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఎస్‌ పాఠశాల ఎదుట సోమవారం బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ..బీసీ గురుకులంలో అనేక సమస్యలున్నాయన్నారు. గురుకులంలో నెలకొన్న సమస్యలకు తోడుగా ఉపాధ్యాయులు వ్యవహారం సక్రమంగా లేదని ఆరోపించారు. విద్యార్థులకు వసతులు కల్పించడం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం, మౌలిక సౌకర్యాలు కల్పించిందని, నేటి ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement