ధర్మేంద్రను బర్త్‌రఫ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధర్మేంద్రను బర్త్‌రఫ్‌ చేయాలి

Jul 23 2026 6:48 AM | Updated on Jul 23 2026 6:48 AM

డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట నర్సారెడ్డి

గజ్వేల్‌లో ర్యాలీ, రాస్తారోకో

గజ్వేల్‌: నీట్‌ ప్రశ్న పత్రాల లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖమంత్రి ధరేంద్రప్రధాన్‌ రాజీనామా చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రపతి ఆయనను బర్తరఫ్‌ చేయాలని సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు తూంకంట ఆంక్షారెడ్డి డిమాండ్‌ చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేపట్టిన విద్యార్థులపై లాఠీచార్జి, రాహుల్‌గాంధీతో ఇతర అగ్రనేతలను అక్రమంగా నిర్బంధించి ఈడ్చుకెళ్లిన ఘటనకు వ్యతిరేకంగా గజ్వేల్‌లో కాంగ్రెస్‌ అధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ, రాస్తారోకో, ధర్నా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రలు ధర్మేంద్రప్రధాన్‌, అమిత్‌షా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...నీట్‌ ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యుడైన ధరేంద్రప్రధాన్‌కు ప్రధాని నరేంద్రమోదీ వత్తాసు పలకడం సరికాదన్నారు. అప్రజాస్వామిక పద్ధతుల్లో పాలన కొనసాగిస్తున్న నరేంద్రమోదీ, అమిత్‌షాలకు ప్రజల నుంచి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో గజ్వేల్‌, వంటిమామిడి, కుకునూర్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్లు నరేందర్‌రెడ్డి, విజయామోహన్‌, శ్రీనివాస్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ సర్థార్‌ఖాన్‌, ఆత్మ కమీటీ చైర్మన్‌ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement