నవోదయలో ఫుట్‌బాల్‌ సెలెక్షన్స్‌ మీట్‌ | - | Sakshi
Sakshi News home page

నవోదయలో ఫుట్‌బాల్‌ సెలెక్షన్స్‌ మీట్‌

Jul 23 2026 6:48 AM | Updated on Jul 23 2026 6:48 AM

వర్గల్‌(గజ్వేల్‌): సిద్దిపేట జిల్లా వర్గల్‌ నవోదయ వేదికగా ఫుట్‌బాల్‌ రీజినల్‌ సెలెక్షన్స్‌ మీట్‌ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. వర్షం తాకిడికి స్టేడియం చిత్తడిగా మారడంతో ఎంపీ హాల్‌లో ప్రారంభోత్సవ వేడుక నిర్వహించారు. ఆతిథ్య నవోదయ ప్రిన్సిపాల్‌ దాసి రాజేందర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి మూడు రోజుల మీట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతేడాది సుబ్రతోకప్‌ టోర్నమెంట్‌ అనుభవాన్ని రంగరించి సెలెక్షన్స్‌ మీట్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. వివాదాలకు తావివ్వకుండా మీట్‌ సక్సెస్‌కు అందరూ సహకరించాలని కోరారు. వైస్‌ప్రిన్సిపాల్‌ మోహన్‌రాథోర్‌, సెలెక్షన్‌ కోచ్‌లు, ఎస్కార్ట్‌ టీచర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నవోదయ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

భయపెట్టిన వర్షం.. మూడు గంటలు ఆలస్యం

సెలెక్షన్‌ మీట్‌ను వర్షం భయపెట్టింది. తెరిపిలేని వర్షంతో బుధవారం ఉదయం ఎంపిక పోటీలకు బ్రేక్‌ పడింది. వర్షం తెరిపివ్వడంతో మూడు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం నుంచి ప్రాథమిక దశ సెలెక్షన్స్‌ నిర్వహించారు. రీజియన్‌ జట్టు కూర్పునకు ప్రావీణ్యం కలిగిన క్రీడాకారులు ఫోకస్‌గా కేటగిరీల వారీగా ఇవి కొనసాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement