వ్రత నాచగిరి.. సేవలతో తరించి | - | Sakshi
Sakshi News home page

వ్రత నాచగిరి.. సేవలతో తరించి

Jul 12 2026 6:52 AM | Updated on Jul 12 2026 6:52 AM

8లో

యువతరం ప్రైవేటు ఉద్యోగాలు వదిలి.. సాగుకు జైకొట్టి.. సిరులు రాబడుతున్నారు. సరికొత్త పద్ధతులు ఆచరిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. వినూత్న ఎవుసం చేస్తూ నాణ్యత గల ఉత్పత్తులు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలువురి యువరైతుల వ్యవసాయంపై.. ఈ వారం ప్రత్యేక కథనాలు.

భక్తులతో కిటకిటలాడినపుణ్యక్షేత్రం

సుప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రం శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలతో అలరారింది. సేవలు, కల్యాణాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలు, ఉమ్మడి మెదక్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. హరిద్రలో పుణ్యస్నానాలాచరించారు. దంపతులు భక్తిశ్రద్ధలతో సత్యనారాయణస్వామి వ్రతమాచరించారు. శ్రీవారి కల్యాణం, సేవలు నిర్వహించి తరించారు. శ్రీవారిని దర్శించుకున్నారు.

–వర్గల్‌(గజ్వేల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement