న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026
వానాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాల జాడలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రోజూ మేఘాలు కమ్ముకుంటున్నా వర్షాలు మాత్రం కురవడంలేదు. ఇటీవల కురిసిన కొద్ది పాటి జల్లులకు దుక్కులు దున్ని మొక్కజొన్న విత్తనాలు విత్తుకున్నారు. నీటి వసతి ఉన్న రైతులు మొక్కజొన్నను కాపాడుకోవడానికి స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. నీటి వసతి లేని రైతులు ఆకాశంలోని మేఘాలవైపు చూస్తున్నారు.
– చిన్నకోడూరు(సిద్దిపేట)


