కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా శంకర్‌ | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా శంకర్‌

Jul 12 2026 6:52 AM | Updated on Jul 12 2026 6:52 AM

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా తప్పెట శంకర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు రాజేంద్రపాల్‌ గౌతమ్‌, టీపీసీసీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సత్యనారాయణలు శనివారం నియామక పత్రాన్ని ఢిల్లీలో అందించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఉపాధ్యక్షులుగా కొత్తూరి నరహరి, బండమీది తిరుపతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు.

50% ఫిట్‌మెంట్‌తో

పీఆర్సీ ప్రకటించాలి

వర్గల్‌(గజ్వేల్‌): ప్రభుత్వం 50% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం వర్గల్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, నర్సింహారెడ్డితో కలిసి పలుపాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆరు నెలలలోపు పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.

చేనేత కార్మికుల

ఇబ్బందులు తీరుస్తాం

గజ్వేల్‌: చేనేత కార్మికుల ఇబ్బందులను తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తానని గజ్వేల్‌ చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షుడు స్వర్గం రాజేశం అన్నారు. శనివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి గౌతమ్‌ నుంచి ధ్రువీకరణ పత్రం అందుకొని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత కార్మికులకు సంక్షేమ పథకాలు అందేలా ప్రయత్నిస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌, సంఘం ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి రామచంద్రం డైరెక్టర్లు భాగ్యలక్ష్మి, అమృతమ్మ, ప్రసాద్‌, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement