
వసతి గృహం తనిఖీ
కోహెడరూరల్(హుస్నాబాద్): శనిగరం గ్రామంలోని బాలుర వసతి గృహన్ని కలెక్టర్ హైమవతి శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహంలో ఉన్న విద్యార్థుల రిజిస్టర్ పరిశీలించారు. రిజిస్టర్‌లో నమోదైన పిల్లలు వసతి గృహంలో లేకపోవడంతో కలెక్టర్ వార్డెన్‌ను ప్రశ్నించారు. అదివారం సెలవు కావడంతో ఇంటికి వెళ్లారని వార్డెన్ తెలిపారు. ఆనంతరం విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వసతి గృహంలో మరుగుదొడ్లు సరిగాలేవని విద్యార్థులు తెలిపారు. సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చిరు.