
సమాజ శ్రేయస్సే లక్ష్యం కావాలి
ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట పట్టణం ప్రశాంత్‌నగర్ రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం సభ్యులు బుధవారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా హరీశ్‌రావును కలిశారు. ఈ సందర్భంగా ఆయన నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. సమాజ శ్రేయస్సుకు కలిసి కట్టుగా కృషి చేయాలని, ప్రశాంత్ నగర్ రెడ్డి సంఘం ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో సూడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.