
యూజీడీ కోసం వినతి
సిద్దిపేటజోన్: పట్టణంలోని సంతోష్‌నగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని మంగళవారం కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో యూజీడీ పనులు ఇంకా ప్రారంభం కాలేదని వివరించారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేనందున వర్ష కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, సెక్రటరీ కనకరాజు, ప్రతినిధులు కనకయ్య, కొండల్‌రెడ్డి, శ్రీనివాస్, నంద కుమార్ తదితరులు పాల్గొన్నారు.