వర్గల్(గజ్వేల్): వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య నాచగిరి శ్రీలక్ష్మీ నృసింహ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నాచగిరి శ్రీక్షేత్రం శ్రీమధుసూదనానంద సరస్వతి బుధవారం సాయంత్రం జ్యోతి ప్రజ్వలనచేసి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. వేదపండితులు పాంచరాత్ర ఆగమ పద్ధతిలో ఉత్సవ పూజలకు శ్రీకారం చుట్టారు. కోనేరు ప్రాంతం నుంచి పుట్టమన్ను తెచ్చి ముఖమండపంలో విశ్వక్సేనారాధన, స్వస్తి పుణ్యహవాచనం, అంకురార్పణం, నీరాజనం, మంత్రపుష్పాది పూజలు నిర్వహించారు.
నేడు ధ్వజారోహణం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ధ్వజారోహణ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గరుడాళ్వారుకు మహా నివేదన చేసి బ్రహ్మోత్సవ బాధ్యతలను అప్పగిస్తారు. రాత్రి భేరీ పూజ నిర్వహించి సకల దేవతలకు ఆహ్వానం పలుకుతారు.
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ