పంటలు ఎండిపోతున్నా పట్టించుకోని సర్కార్‌ | - | Sakshi
Sakshi News home page

పంటలు ఎండిపోతున్నా పట్టించుకోని సర్కార్‌

Mar 11 2025 7:23 AM | Updated on Mar 11 2025 7:23 AM

పంటలు

పంటలు ఎండిపోతున్నా పట్టించుకోని సర్కార్‌

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

దుబ్బాకరూరల్‌: పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడలేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో సోమవారం సాగునీటి కాలువ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంవత్సరం గడస్తున్నా కాలువలు పూర్తి కాలేదన్నారు. కాలువ నిర్మాణం పూర్తయితే మల్లన్న సాగర్‌ ద్వారా వచ్చే నీరు 30 గ్రామాలకు అందుతాయన్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెడితే పంటలు ఎండి పోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వర్గీకరణతోనే

అందరికీ న్యాయం

ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు పరశురాములు

చిన్నకోడూరు(సిద్దిపేట): వర్గీకరణతోనే మాదిగ ఉప కులాలకు న్యాయం జరుగుతుందని మహాజన్‌ సోషలిస్ట్‌ పార్టీ(ఎంఎస్పీ) జిల్లా అధ్యక్షుడు పరశురాములు అన్నారు. సోమ వారం ఎమ్మార్పీఎస్‌ లక్ష డప్పులు కార్యక్రమం చిన్నకోడూరులో నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంద కృష్ణ నాయకత్వంలో 30 ఏళ్ల పోరాట ఫలితం తుది దశకు చేరిందన్నారు. వర్గీకరణ అమలయ్యేంత వరకు గ్రూప్‌ ఫలితాలు, ఉద్యోగాల నోటిఫికేషన్లు నిలిపివేయాలన్నారు. తెలంగాణలో అత్యధికంగా ఉన్న మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలన్నారు. సమావేశంలో ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్‌, నాయకులు రంజిత్‌, రాజు, రమేష్‌, మురళీ, రవి, బాబు, కళాకారులు పాల్గొన్నారు.

సమాజంలో మహిళల

పాత్ర కీలకం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): సమాజంలో మహిళల పాత్ర కీలకమని జిల్లా లీగల్‌ సెల్‌ అఽథారిటీ సెక్రటరీ స్వాతిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయిపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వాతిరెడ్డి మాట్లాడుతూ మహిళల హక్కులపై వివరించారు. అనంతరం స్వాతిరెడ్డిని, మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు పన్యాల భూపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిడి పూర్ణచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ జిల్లా స్థాయి కమిటీ నియామకం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): బీజేపీ జిల్లా స్థాయి కమిటీని సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరిశంకర్‌ ముదిరాజ్‌ నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కన్వీనర్‌గా నలగామ శ్రీనివాస్‌, కో కన్వీనర్లుగా తొడుపునూరి వెంకటేశం, భూరెడ్డి విభిషన్‌ రెడ్డిలను నియమిస్తున్నట్లు తెలిపారు.

పంటలు ఎండిపోతున్నా పట్టించుకోని సర్కార్‌ 1
1/1

పంటలు ఎండిపోతున్నా పట్టించుకోని సర్కార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement