తొగుట(దుబ్బాక): వంగసాగులో కాయ, కాండం తొలుచు పురుగు నియంత్రణకు లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని ఏఈఓ నాగార్జున రైతులకు సూచించారు. మండలంలోని పెద్ద మాసాన్‌పల్లి మదిర ఇందిరానగర్ రైతు అనిల్‌రెడ్డి సాగుచేసిన వంకాయ తోటలో లింగాకర్షణ బుట్టల ఏర్పాటుపై రైతులకు సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగసాగులో రైతులు అధిక మొత్తంలో పురుగు నివారణకు ఖర్చు చేస్తారని, సమగ్రసస్య రక్షణ చర్యలు చేపడితే ఖర్చు తగ్గే అవకాశముందన్నారు. ఈ పురుగు ఆశించినప్పుడు మొక్క తలవాల్చినట్టుగా కనిపిస్తుందని, అది తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఈ పురుగును నియంత్రించడానికి మొక్క నాటిన 15 రోజుల నుంచిఎకరాకు 18 లిగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బుట్టలో పడిపోయిన మగ పురుగుల సంఖ్యను బట్టి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, బుట్టల ఏర్పాటుతో సుమారు 30 శాతం వరకు రసాయన మందుల వాడకం తగ్గించవచ్చునని ఏఈఓ నాగార్జున చెప్పారు.
ఏఈఓ నాగార్జున