
వర్గల్‌లో ప్రచారం నిర్వహిస్తున్న నర్సారెడ్డి
● వారి త్యాగాన్ని సొమ్ము చేసుకున్న కేసీఆర్
● దళిత, మైనార్టీ, బీసీ బంధుల పేరిట దగా
● గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి
వర్గల్(గజ్వేల్): భూములు కోల్పోయిన నిర్వాసితులకు తీరని అన్యాయం జరిగిందని, వారి త్యాగాన్ని సీఎం కేసీఆర్ సొమ్ము చేసుకున్నారని గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి ఆరోపించారు. పేదల భూములు కొల్లగొట్టి పెద్దలకు కట్టబెట్టిన కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సోమవారం మండలంలోని వర్గల్, గుంటిపల్లి, శేరిపల్లి గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్‌తో బీఆర్‌ఎస్‌లో వణుకు మొదలైందని, దళిత, బీసీ, మైనార్టీ బంధుల పేరిట ఆయా వర్గాలను దగాచేశారని ధ్వజమెత్తారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, రేషన్‌కార్డులు, మూడెకరాల భూపంపిణీ, తదితర హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రచార కమిటీ చైర్మన్ రంగారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సందీప్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్, మాజీ జెడ్పీటీసీ ప్రభుదాస్‌గౌడ్, సర్పంచ్ గోపాల్‌రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.