నెర్రెలు బారిన నిర్లక్ష్యం! | - | Sakshi
Sakshi News home page

నెర్రెలు బారిన నిర్లక్ష్యం!

Oct 26 2026 7:54 AM | Updated on Oct 26 2026 7:54 AM

గడ్డపోతారం సరాక రసాయన పరిశ్రమ ప్రమాదానికి నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రాథమికంగా తేలింది. క్లోరోఫాం గ్యాస్‌ వెళ్లే దారిలో పలుచోట్ల క్రాక్స్‌ (నెర్రెలు) రావడంతోనే ఈ విష వాయువు లీకై ప్రాణనష్టానికి దారితీసినట్లు భావిస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యానికి తోడు, పరిశ్రమలో సంబంధిత అధికారుల భద్రత పరమైన తనిఖీల లోపంతోనే ఈ ప్రమాదం జరిగి అమాయక కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసినట్లు సమాచారం. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి

ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీల విభాగం అధికారులు, బ్రాయిలర్‌ విభాగం అధికారులు ఆయా పరిశ్రమలకు తనిఖీలకు వెళ్లినప్పుడు ఇలాంటి కీలక యూనిట్లను క్షుణ్ణంగా ప్రత్యేకంగా పరిశీలించాలి. కేవలం థర్డ్‌ పార్టీ సంస్థలు ఇచ్చిన ఇన్‌స్పెక్షన్‌ రిపోర్టులను చూసి వదిలేయకుండా.. ప్రమాదాలకు ఆస్కారం ఉండే చోట్ల ప్రత్యేకంగా తనిఖీలు చేయాలి. ఈ విభాగాల అధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం అవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అమాయక కార్మికులు, ఉద్యోగుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. గురువారం రాత్రి ఈ పరిశ్రమలో క్లోరోఫాం వాయువు లీకై ఏపీకి చెందిన పి.సుదర్శన్‌రావు, కె.బాలాజీ అనే కార్మికులిద్దరు మృత్యువాత పడిన విషయం విధితమే. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు ఈ పరిశ్రమ మూసివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ప్రాథమిక విచారణ కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

కిట్లు లేకపోవడంతో ప్రాణనష్టం!

నిబంధనల ప్రకారం ప్రమాదకరమైన గ్యాస్‌లు లీకయ్యే అవకాశాలున్న యంత్రాల వద్ద పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు ఆక్సిజన్‌తో కూడిన పర్సనల్‌ ప్రొటక్షన్‌ కిట్లు అందుబాటులో ఉంచాలి. ప్రమాదాలకు ఆస్కారం ఉండే యూనిట్ల వద్ద పనిచేసే కార్మికులు, టెక్నికల్‌ ఉద్యోగులు ఈ కిట్లు తప్పకుండా దరించేలా యాజమాన్యం పర్యవేక్షించాలి. సరాక పరిశ్రమ ఘటనలో ఆక్సిజన్‌తో కూడిన పర్సనల్‌ ప్రొటెక్షన్‌ కిట్లు లేకపోవడంతో ప్రాణనష్టానికి దారి తీసినట్లు తెలుస్తోంది. యాజమాన్యం ఈ ఆక్సిజన్‌ కిట్లను అందుబాటులో ఉంచిందా? లేదా అనేది అధికారులు తేల్చాలి.

బోరపట్లలో ఇలాంటి ప్రమాదమే..

హత్నూర మండలం బోరపట్లలోనూ ఇలాగే విష వాయువులు లీకై ఓ కార్మికుడు మృతి చెందాడు. అధికారులు, పరిశ్రమ యాజమాన్యం కలిసి ఈ ప్రమాదాన్ని బయటకు పొక్కనీయకుండా వ్యవహరించారనే ఆరోపణలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఇప్పుడు సరాక పరిశ్రమలో గురువారం ప్రమాదం జరిగితే శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరాక పరిశ్రమ ప్రమాద విషయమై వివరణ కోసం ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీ విభాగం అధికారి నెహును ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా ఆయన స్పందించలేదు.

క్లోరోఫాం వాయువు వెళ్లే పైప్‌లైన్‌కు పగుళ్లు

అందుబాటులో లేని ఆక్సిజన్‌ రక్షణ కిట్లు!

ఇవి ఉంటే గ్యాస్‌లీకై నా ప్రాణాలు దక్కే అవకాశం

‘సరాక’ ప్రమాద ఘటనపై ప్రాథమిక విచారణలో కీలక అంశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement