సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎస్‌ఐఆర్ విషయంలో కాంగ్రెస్ నాయకులు, బీఎల్‌ఏలు, సూపర్‌వైజర్లు పూర్తి అప్రమత్తతో వ్యవహరించాలని డీసీసీ అధ్యక్షుడు పట్లోల్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఏఐసీసీ పరిశీలకుడు సరళ్ పటేల్ సూచించారు. ఆదివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ‘ఓట్ బచావ్.. దేశ్ బచావ్’ కార్యాక్రమంలో భాగంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు నవంబర్ 1న ఢిల్లీ రాంలీల మైదాన్‌లో జరిగే భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి విజయవంతం చేయాలన్నారు. జిల్లా నుంచి సుమారు వెయ్యి మంది ముఖ్యనేతలు ఢిల్లీకి తరలి వెళుతున్నట్లు తెలిపారు. ఈ సభ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. పార్టీ తయారు చేసిన ప్రత్యేక యాప్ ద్వారా అర్హులైన ఏ ఒక్కరి ఒటు కూడా తొలగిపోకుండా చూస్తామన్నారు. ఈసీఐ జ్ఞానేశ్‌కుమార్, మోదీ, అమిత్‌షాకు వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ చేస్తున్న పోరాటంలో కాంగ్రెస్ శ్రేణులంతా కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, నాయకులు ప్రీతం, కిరణ్‌గౌడ్, జార్జ్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి


