ఓటరు జాబితాపై ప్రజల్లో చైతన్యం | - | Sakshi
Sakshi News home page

ఓటరు జాబితాపై ప్రజల్లో చైతన్యం

Oct 26 2026 7:54 AM | Updated on Oct 26 2026 7:54 AM

పటాన్‌చెరు టౌన్‌: ఓటరు జాబితాపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నా రు. ఆదివారం పటాన్‌చెరు డివిజన్‌ పరిధిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు దక్కేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితా ప్రాముఖ్యతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీందర్‌, జిన్నారం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ రెడ్డి, మేధావుల విభాగం కన్వీనర్‌ వెంకటేశ్‌, బీజేపీ సీనియర్‌ నాయకులు ఆంజనేయులు, కుమార్‌, దేవేందర్‌ గౌడ్‌, కిసాన్‌మోర్చా అధ్యక్షుడు రాజేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ అంజిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement