మా పల్లె బతుకమ్మ | - | Sakshi
Sakshi News home page

మా పల్లె బతుకమ్మ

Oct 18 2026 7:45 AM | Updated on Oct 18 2026 7:45 AM

● అడవికి వెళ్లి తీరొక్క పూలు తెచ్చి పేర్చి.. ● సిద్దిపేట జిల్లాలో ఘనంగా నిర్వహణ పెత్తరమావాస్యకు ఎంగిలి పూలు 12 ఏళ్ల నుంచే బతుకమ్మ ఆడుతున్నా

పురుషులు కూడా ఆడే సంప్రదాయం
● అడవికి వెళ్లి తీరొక్క పూలు తెచ్చి పేర్చి.. ● సిద్దిపేట జిల్లాలో ఘనంగా నిర్వహణ

హుస్నాబాద్‌రూరల్‌: పల్లెటూరు ఆడపడుచులు ప్రకృతిని పూజించే సంస్కృతి బతుకమ్మ పండగ బొడ్డెమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. తెలంగాణ అంతటా ఆడపడుచులు బతుకమ్మ సంబరాలను జరుపుకుంటే హుస్నాబాద్‌ ప్రాంతంలో పురుషులు కూడా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడే ఆనవాయితీ ఉంది. హుస్నాబాద్‌, అక్కన్నపేట మండలాల్లో తోటపల్లి, గాంధీనగర్‌, గొల్లపల్లి గ్రామస్తులు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. మగవారు సైతం బతుకమ్మ పండుగను జరుపుకొనే ఆనవాయితీపై ఈ వారం కథనం.

పెత్తరమావాస్యకు పల్లెవాసులు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఎంగిలిపూల పండుగ ప్రారంభంతో ఏడు రోజులు బతుకమ్మ ఆటలను మహిళలు అడిపాడుతారు. ఈ పండుగ వచ్చిందంటే రైతు కుటుంబాలు అత్తారింటి నుంచి అక్కాచెల్లెళ్లను తీసుకురావడానికి కుమారులను పంపుతారు. అన్నదమ్ములు మబ్బులోనే నిద్రలేచి దోస్తులను పోగు చేసుకొని అడవికి పోయి తంగేడు పూలు, చామంతి, కట్ల, గడ్డి పూలు తీసుకొచ్చి ఇస్తారు. గుమ్మడి పువ్వులోని పసుపు రంగు కాండంను గౌరమ్మగా భావించి బతుకమ్మ మధ్యలో పెడతారు. అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చిన నూతన వధువులు వారి కష్ట,సుఖాలను తెలిపే పాటలు పాడటం విశేషం. పుట్టినూరు వారిని అన్నలుగా భావించిన ఆడపడుచులు అత్తారింటి కష్టాలను ఏకరువు పెడుతూ పల్లె పదాలను జోడించి లయ బద్ధంగా పాటలు పాడుతారు.

మా పెద్దల నుంచి వస్తోంది..

మహిళలతో కలిసి బతుకమ్మ ఆడే సంప్రదాయం మా పెద్దల నుంచి వస్తోంది. మా చిన్నప్పుడు మా ముందు తరం వారు ఆడేవారు. ఇప్పుడు దానిని మేం ఆచరిస్తున్నాం. బతుకమ్మ పండుగకు ఇంటికి వచ్చిన ఆడపడుచులను సంతోషపెట్టేందుకు వారితో కలిసి ఆడుతున్నం. మహిళల మాదిరిగానే మేం బతుకమ్మ పాటలు పాడి ఆడుతం. మూడు రోజుల ముందే గుట్టలకు పోయి తంగేడు, గునుగు పువ్వులు తెచ్చి బతుకమ్మను పేర్చేవాళ్లం.

– పోశవేని కొమురయ్య, తోటపల్లి

అన్నలు మాతోటి కలిసి ఆడుతరు

ఊర చెరువు గట్టుపై బతుకమ్మ ఆటలు ఆడుతం. ఆడోళ్లమంద రం ఒక దగ్గర ఆడినా మా అన్నలు, తమ్ములు కూడా మా తోటి కలిసి బతుకమ్మ ఆడుతరు. మాతో కలిసి పాటలు పాడుతరు. పెద్ద బతుకమ్మ రోజు ఎంత చీకటి పడినా ఆ సంతోషం మధ్య అలసట రాదు.

–పోలు వెంకమ్మ,తోటపల్లి

దుబ్బాక: నేను 12 ఏళ్ల నుంచే బతుకమ్మ ఆడుతున్నా. మా తల్లిగారి ల్లు మిరుదొడ్డిలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే దొర గడీ ముందు బతుకమ్మలు ఆడేటోళ్లం. నాకు ఇద్దరు కూతుళ్లు, నలుగురు కొడుకులు. నా ఇద్దరు కూతుళ్లతో పాటు ఐదుగురు మనవరాళ్లకు బతుకమ్మ ఆడటం నేర్పా. బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఊరువాడ అంతా ఒక్కటవుతుంది. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడటం అదో చెప్పలేని మధురానుభూతి. బతుకమ్మను తప్పకుండా పేర్చుతా. – సరోజన ,(82 ఏళ్లు), దుబ్బాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement