రన్నరప్‌గా సిద్దిపేట
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్‌లోని లాల్‌బహదూర్ కళాశాల మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి మినీ సబ్‌జూనియర్ బాలుర చాంపియన్‌షిప్ పోటీలు శనివారం ముగిశాయి. ఈ పోటీల్లో నిజామాబాద్ జట్టు చాంపియన్‌షిప్ ట్రోఫీని కై వసం చేసుకోగా, రన్నరప్‌గా సిద్దిపేట, మూడో స్థానంలో మహబూబ్‌నగర్ జట్లు నిలిచాయి. కాగా, నాలుగో స్థానంలో మంచిర్యాల జట్టు నిలిచింది. తెలంగాణ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ పి.సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్ ఖాన్, జీడబ్ల్యూఎంసీ అడిషనల్ కమిషనర్ జోన, హనుమకొండ డీవైఎస్ఓ ప్రశాంత్, ఆలిండియా సాఫ్ట్‌బాల్ సంయుక్త కార్యదర్శి శోభన్‌బాబు, అసోసియేషన్ జిల్లా సెక్రటరీ రాజేందర్, డాక్టర్ ఫణిందర్ తదితరులు పాల్గొన్నారు.


