చీడపీడలు ప్రారంభ దశలోనే గుర్తించాలి | - | Sakshi
Sakshi News home page

చీడపీడలు ప్రారంభ దశలోనే గుర్తించాలి

Oct 18 2026 7:45 AM | Updated on Oct 18 2026 7:45 AM

జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి

జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి

దుబ్బాకటౌన్‌: రైతులు పంటలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ చీడపీడలు, బెట్ట పరిస్థితులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి సూచించారు. శనివారం రాయపోల్‌ మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో గజ్వేల్‌ సహాయ వ్యవసాయ సంచాలకులు బాబు నాయక్‌తో కలిసి వరి, పత్తి, కంది పంటలను పరిశీలించి వాటి ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. పత్తి పంట పరిస్థితిని బట్టి 13–0–45 ఎరువును ఒక కిలో, ఫార్ములా–4ను ఒక కిలో వినియోగించి పిచికారీ చేయడం ద్వారా బెట్ట ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. కందిలోనూ బెట్ట పరిస్థితులు కనిపిస్తున్నందున నేలలో తేమ, పంట పరిస్థితులను బట్టి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్‌. నరేశ్‌, వ్యవసాయ విస్తరణ అధికారి స్వర్ణలత, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement