గజ్వేల్రూరల్: ధర్మం, జాతీయతా భావం కోసం పనిచేస్తూ దేశ భద్రతలో భాగస్వాములు కావాలని దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీరాం భరత్ పేర్కొన్నారు. విజయదశమి ఉత్సవాల్లో భాగంగా శనివారం పట్టణంలోని ఐవోసీ(ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) నుంచి అంగడిపేట హనుమాన్ దేవాలయం, బసవేశ్వర చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తా, సీఎం మినీ క్యాంపు కార్యాలయం పక్క నుంచి ఐవోసీ మైదానం వరకు పద సంచాలన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విభాగ్ సంఘచాలక్ పటోళ్ల మురళీధర్రెడ్డి, ముఖ్య అతిథి సంజయ్గుప్తలతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రపంచంలో చాలా సంస్థలు ఉద్భవించినప్పటికీ 100 సంవత్సరాల పాటు ధర్మం, జాతీయతా భావం కోసం నిలబడింది ఆర్ఎస్ఎస్ మాత్రమేనని గుర్తు చేశారు. దేశం ఆర్థికంగా ఎదగాలంటే స్వదేశీ వస్తువులనే వాడాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవకులు పాల్గొన్నారు.


