న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఆగస్టు శ్రీ 2026
సంగారెడ్డిలో రాఖీలు కొనుగోలు చేస్తున్న మహిళలు
అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ వచ్చింది. శుక్రవారం పండుగను ఘనంగా జరుపుకొనేందుకు జిల్లా ప్రజలు సమాయత్తం అయ్యారు. సంగారెడ్డి మార్కెట్‌లో వివిధ రకాల రాఖీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కుందన్‌లు, మెరుపులు జరీతో పాటు స్పాంజితో తయారు చేసిన రాఖీలు ఆకట్టుకుంటున్నాయి. పిల్లలను ఆకర్షించేందుకు కార్టున్ రాఖీలు కూడా వచ్చాయి. అలాగే మిఠాయి దుకాణాల్లో వివిధ రకాల స్వీట్లు తయారు చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు.
– సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి
ఆకట్టుకుంటున్న రకరకాల రాఖీలు


