నారాయణఖేడ్: భూ రీ సర్వేను ఎలాంటి పొరపాట్లు, తప్పులకు తావు లేకుండా పారదర్శకంగా, నిబంధనల ప్రకారం చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. మానూరు మండల పరిధిలోని గట్ లింగంపల్లి, నాగల్‌గిద్ద మండలం కరస్‌గుత్తి గ్రామాల్లో కొనసాగుతున్న భూ రీ–సర్వే ను గురువారం పరిశీలించారు. భూముల కొలతలు, హద్దుల నిర్ధారణ, భూ వివరాల నమోదు తదితర ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ యజమానులకు ఇబ్బందులు కలగకుండా వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి, డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్, మానూర్ తహసీల్దార్ విష్ణుసాగర్, ఆర్‌ఐ శంకర్‌రెడ్డి, సర్వేయర్ సుమలత, జూనియర్ అసిస్టెంట్ ఖాజా మోయినొద్దీన్, ఉప సర్పంచ్ ప్రతిభ అనిల్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్


