ఆధునిక సైన్స్‌ల్యాబ్‌ల ఏర్పాటు
సైన్స్ విద్యా నాణ్యత పెంపు
నారాయణఖేడ్: ప్రభుత్వ పాఠశాలలను సైన్స్ హబ్‌గా మార్చే చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 9, 10వ తరగతి విద్యార్థులకు ప్రయోగాల ద్వారా పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేయించేందుకు అత్యాధునిక సైన్స్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేస్తున్నారు. సైన్స్ పాఠ్యాంశాలను కేవలం పుస్తకాల్లో చదవడమే కాకుండా ప్రయోగాల ద్వారా అర్థం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 36 పాఠశాలల్లో ఈ అత్యాధునిక సైన్స్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయనున్నారు. సంగారెడ్డి జిల్లాకు అత్యధికంగా 28 పాఠశాలలు ఉండగా మెదక్ జిల్లాలో 5, సిద్దిపేట జిల్లాలో 3 పాఠశాలలున్నాయి. ఇందుకుగాను రూ.9.30 కోట్లను ఆర్.ిసీ నం.778/ఎస్‌ఎస్/సీడబ్ల్యూ /2026–27 ద్వారా పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో అత్యధికంగా జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, కస్తూర్బాగాంధీ (కేజీబీవీ)లకే ప్రాధాన్యం ఇచ్చింది. ప్రతీ స్కూల్‌లో సైన్స్ ల్యాబ్ నిర్మాణం, పరికరాల కోసం ఒక్కో పాఠశాలకు రూ.26లక్షలు ఖర్చు చేయనున్నారు. ల్యాబ్ గది నిర్మాణం, వర్క్ స్టేషన్స్, ఫర్నీచర్ కోసం రూ.25లక్షలు కాగా, సైన్స్ ల్యాబ్ ఎక్విప్‌మెంట్ కొనుగోలుకు రూ.లక్ష చొప్పున కేటాయించారు.
ఉమ్మడి జిల్లాలో ఇవీ పాఠశాలలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో 36 పాఠశాలల్లో సైన్స్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలో కేజీబీవీ నారాయణఖేడ్, కంగ్టి, ఆందోల్, సదాశివపేట్, తాటిపల్లి, హత్నూర, సిర్గాపూర్, రాయికోడ్, పుల్‌కుర్తి, జెడ్పీహెచ్‌ఎస్ మునిపల్లి, ముదిమాణిక్యం, కంకోల్(యుఎం), గొంగ్లూర్, ఫసల్‌వాది, ఇంద్రకరణ్, ఎద్దుమైలారం, కొల్లూరు, పిచేరాగడి, ర్యాకల్, ధన్‌సిరి, కల్హేర్, మాసాన్‌పల్లి, కడ్పల్, చిరాగ్‌పల్లి, హద్నూర్, చాల్కి, ఎంయూపీఎస్ పుక్తానగర్, కాసీంపూర్, మెదక్ జిల్లాలో జెడ్పీహెచ్‌ఎస్ కౌడిపల్లి, వరిగుంతం, రుస్తుంపేట్, కేజీబీవీ చిట్కుల్, వెల్దుర్తి, సిద్దిపేట జిల్లాలో జెడ్పీహెచ్‌ఎస్ రాంసాగర్, కేజీబీవీ అక్కన్నపేట్, ఎంపీహెచ్‌ఎస్ బంగ్ల వెంకటాపూర్ పాఠశాలలున్నాయి.
ల్యాబ్‌ల నిర్మాణం
ల్యాబ్‌ల నిర్మాణ బాధ్యత తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఈఈడబ్ల్యూఐడీసీ) చేపట్టనుంది. టర్న్‌కీ పద్ధతిలో గదుల నిర్మాణం నుంచి ఎలక్ట్రిఫికేషన్, పరికరాల ఏర్పాటు వరకు అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పనుల నాణ్యతను ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు సంయుక్తగా తనిఖీ చేయనున్నారు. అంతా సక్రమంగా పూర్తి చేసి పాఠశాల హెచ్‌ఎంలకు అప్పగించాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. త్వరగా ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారు.
9, 10 తరగతుల విద్యార్థులకు అందుబాటులోకి
ఉమ్మడి జిల్లాలో 36 పాఠశాలల్లో ఏర్పాటు
రూ.9.30 కోట్లు విడుదల
సంగారెడ్డి జిల్లాకు అత్యధికంగా 28, మెదక్‌కు 5, సిద్దిపేటకు 3
ప్రయోగాధారిత బోధన అందితే శాసీ్త్రయ ఆలోచన, పరిశీలనా శక్తి, ప్రశ్నించే తత్వం, సమస్య పరిష్కార నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత వంటి అనేక సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ విద్య నాణ్యత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో భవిష్యత్ ఉన్నత విద్యతోపాటు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టిమ్) కేరీర్‌లకు బలమైన పునాది ఏర్పడనుంది.


