హామీల అమలుపై నిలదీస్తాం | - | Sakshi
Sakshi News home page

హామీల అమలుపై నిలదీస్తాం

Aug 31 2026 7:46 AM | Updated on Aug 31 2026 7:46 AM

ఎమ్మెల్యే మాణిక్‌రావు

జహీరాబాద్‌: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీల అమలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై సమరభేరి కోసం పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపుమేరకు సన్నాహక సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. నియోజకవర్గంలో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, చెరువులు, ప్రభుత్వ భూములు, ప్రజా సంక్షేమ పథకాలు తదితర ప్రజా సమస్యలపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమావేశంలో డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ శివకుమార్‌, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, వెంకటేశం, సంజీవరెడ్డి, నర్సింహులు, బీఆర్‌ఎస్‌ నాయకులు తంజీం, యాకూబ్‌, అబ్దుల్లా, కలీం, నర్సింహారెడ్డి, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement