సిద్దిపేటకమాన్: పరారైన రిమాండ్ ఖైదీని పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట వన్‌టౌన్ సీఐ మహేందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. సాధారణ వైద్య పరీక్షల కోసం జిల్లా జైలు నుంచి ఏడుగురు ఖైదీలను వ్యానులో ఏఆర్ పోలీసులు శనివారం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షల అనంతరం నలుగురు ఖైదీలను వ్యానులో ఎక్కించగా వీరిలో రిమాండ్‌లో ఉన్న ఖైదీ జొన్నల సాయికుమార్ బేడీలు తొలగించుకుని ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకి పారిపోయాడు. సీసీ ఫుటేజీలు పరిశీలించగా సాయికుమార్ కోమటిచెరువు కట్టపై ఉన్న బైక్‌ను దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీ టీవీ, ఇతర ఆధారాల సహాయంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం కామారెడ్డి రైల్వేస్టేషన్ సమీపంలో సాయికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడు దొంగిలించిన బైక్‌పై మేడ్చల్‌లోని సోదరి ఇంటికి వెళ్లి అక్కడ బట్టలు మార్చుకుని రైలులో కామారెడ్డికి వెళ్లాడు. అక్కడి నుంచి నిజామాబాద్ పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు.
కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులోకి


