పటాన్‌చెరుటౌన్: తల్లీకుమారుడు అదృశ్యమైన ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్‌కు చెందిన వీరేశానికి తన భార్య స్వాతితో 15న గొడవ జరిగింది. దీంతో స్వాతి మూడేళ్ల కుమారుడు విరాజ్‌ను తీసుకొని ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు వారి కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె సోదరుడు రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గీతం విద్యార్థిని..
హాస్టల్లో ఉండే ఓ విద్యార్థిని ఔటింగ్‌కని వెళ్లి అదృశ్యమైన ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్‌నగర్‌కు చెందిన విద్యార్థిని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గీతం కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బుధవారం సాయంత్రం కాలేజ్ హాస్టల్ నుంచి ఔటింగ్‌కి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్‌చేస్తే స్విచ్‌ఆఫ్ వచ్చింది. దీంతో హైదర్‌నగర్ నుంచి కుటుంబ సభ్యులు రుద్రారం హాస్టల్‌కు వచ్చి తెలుసుకోగా బుధవారం సాయంత్రం ఏడున్నర సమయంలో ఔటింగ్‌కి వెళ్లినట్టు రిజిస్టర్లో రాసి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె తండ్రి గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


