దుబ్బాక: ప్రజలకు అంకిత భావంతో వైద్య సేవలందిస్తున్న దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్‌సింగ్ ప్రతిష్టాత్మక వైద్యరత్న జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో అవార్డు సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ విష్ణు, గుర్రాల శ్రీనివాస్, కుంబాల రవీందర్ ఆధ్వర్యంలో హేమరాజ్‌సింగ్ పేరును ఖరారు చేశారు. 26న బీఎస్‌ఏ 19వ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ డాక్టర్ హేమరాజ్‌సింగ్‌కు ఆ అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ సదస్సుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, గోవా, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 600 మందికిపైగా ప్రతినిధులు హాజరవుతున్నారని వారు తెలిపారు. నేషనల్ అవార్డుకు ఎంపిక కావడంపై హేమరాజ్‌సింగ్‌ను ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు అభినందించారు.


