8లో
తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిజిస్ట్రేషన్ కోసం వేచి చూస్తున్న రైతులు
తహసీల్దార్ లాగిన్..నాలుగు తర్వాతే :
తహసీల్దార్లు లాగిన్ అయ్యేందుకు సాయంత్రం దాక వేచి ఉండాల్సి వస్తోంది. నాలుగు తర్వాతే లాగిన్‌కు వీలవుతోంది. భూభారతి ఆపరేటర్‌లకు మధ్యలో అప్పుడప్పుడు లాగిన్ అయ్యేందుకు వీలు కలుగుతోంది. ఎప్పుడు సర్వర్ వస్తుందా అని ఆపరేటర్లు, తహసీల్దార్లు వేచి చూస్తున్నారు. ఒక్కోసారి కార్యాలయం పనివేళలు ముగిసాక సర్వర్ వస్తోంది. అప్పుడు కూడా ఒకటీ, రెండుకు మించి రిజిస్ట్రేషన్లు జరగడం లేదు.
స్లాట్ బుకింగ్ కూడా కష్టమే..:
రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్లాట్ కూడా సరిగ్గా బుక్‌కావడం లేదు. కార్యాలయం వేళలు పూర్తయ్యాక సాయంత్రం 6 తర్వాత స్లాట్‌లు బుక్ అవుతున్నాయి.
విదేశాలకు వెళ్లే వారి ప్రయాణం వాయిదా..
రిజిస్ట్రేషన్ల కోసం విదేశాల నుంచి స్వస్థలాలకు వచ్చిన వారు ఈ రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే ఏకంగా తమ తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. నిత్యం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి సర్వర్ వస్తుందా..? సమస్య పరిష్కరమైందా..? అని వాకబు చేస్తున్నారు.
సర్వర్ డౌన్
మొరాయిస్తున్న భూ భారతి సైట్
పూర్తిగా మందగించిన భూముల రిజిస్ట్రేషన్లు
రిజిస్ట్రేషన్లు జరగక తహసీల్దార్ కార్యాలయాల్లో రైతుల పడిగాపులు
పక్షం రోజులుగా కొనసాగుతున్న పట్టాదారుల కష్టాలు
పోర్టల్ యాన్యువల్ మెయింటెనెన్స్ అంటున్న అధికారులు


