సాంకేతిక విద్యకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక విద్యకు ప్రాధాన్యం

Jul 12 2026 6:52 AM | Updated on Jul 12 2026 6:52 AM

సంగారెడ్డి: విద్యార్థులకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యతోపాటు సురక్షితమైన రవాణా సౌకర్యాలు, ఆధునిక మౌలిక వసతులు కల్పనకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని మంత్రి దామోదర నర్సింహ తెలిపారు. చౌటకూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలల విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నూతన బస్సులతోపాటు స్మార్ట్‌ కంప్యూటర్‌ ల్యాబ్‌ను మంత్రి దామోదర శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కళాశాలలకు రాకపోకలు సాగించేలా చర్యలు చేపట్టామన్నారు. జేఎన్‌టీయూ పరిధిలోని ఇంజనీరింగ్‌ కళాశాలల విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతనంగా రెండు బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. డిజిటల్‌ విద్యకు ప్రాధాన్యం ఇస్తూ ఏర్పాటు చేసిన స్మార్ట్‌ కంప్యూటర్‌ ల్యాబ్‌ ద్వారా విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకునే అవకాశం లభిస్తుందని, ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. విద్యార్థులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూహెచ్‌ వైస్‌చాన్సలర్‌ డా.కిషన్‌కుమార్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ పాండు, కళాశాల ప్రిన్సిపాల్‌ విశ్వనాథరాజు, ఆందోల్‌ ఆర్డీఓ రమేశ్‌బాబు, ప్రజాప్రతినిధులు, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

వట్‌పల్లి(అందోల్‌): ప్రభుత్వాస్పత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. వట్‌పల్లిలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి నిర్మాణం శరవేగంగా పూర్తి చేసి ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ ప్రాంగణంలో నిర్మించనున్న పోలీస్‌స్టేషన్‌, తహసీల్దారు, ఎంపీడీఓ కార్యాలయాల నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదిత స్థలాలను ఆయన పరిశీలించారు.

నాగయ్య బాగున్నావా..

మంత్రి వట్‌పల్లిలో పర్యటనను ముగించుకొని మండల పరిధిలోని గొర్రెకల్‌ గ్రామం మీదుగా తన కారులో వస్తున్న క్రమంలో గ్రామ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ కార్యకర్త నాగయ్యను చూసి కారు నిలిపి దిగి నాగయ్య వద్దకు చేరుకుని పలకరించి అతని యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

మంత్రి దామోదర రాజనర్సింహ

జేఎన్‌టీయూ సుల్తాన్‌పూర్‌ కళాశాల విద్యార్థులకు రవాణా సౌకర్యం

నూతన బస్సులు, కంప్యూటర్‌ ల్యాబ్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement