మారిన ఎకై ్సజ్‌ హద్దులు | - | Sakshi
Sakshi News home page

మారిన ఎకై ్సజ్‌ హద్దులు

Jul 12 2026 6:52 AM | Updated on Jul 12 2026 6:52 AM

పటాన్‌చెరు టౌన్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మున్సిపాలిటీలను సీఎంసీలో విలీనం చేసిన నేపథ్యంలో అబ్కారీ శాఖ కూడా తన పరిధులను పునర్వ్యవస్థీకరించింది. కొత్త పరిపాలనా సరిహద్దులను ఆధారంగా చేసుకుని ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలో మార్పులు చేయడంతోపాటు అధికారులు, సిబ్బందిని ఇతర స్టేషన్లకు బదిలీ చేసింది. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) వెలుపలున్న ప్రాంతాలను జిల్లా పరిధిలోని స్టేషన్లకు అనుసంధానం చేయగా, లోపల ఉన్న ప్రాంతాలను హైదరాబాద్‌కు చెందిన స్టేషన్ల పరిధిలోకి మార్చింది.

మాదాపూర్‌కు పటాన్‌చెరు ఎకై ్సజ్‌ సిబ్బంది

గతంలో పటాన్‌చెరు కేంద్రంలో మాత్రమే ఎకై ్సజ్‌ స్టేషన్‌ ఉండేది. కొద్ది నెలల క్రితం అమీన్‌పూర్‌లో మరో అబ్కారీ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. అయితే ప్రత్యేక సిబ్బందిని నియమించకపోవడంతో పటాన్‌చెరు స్టేషన్‌ అధికారులు, సిబ్బందే రెండు స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ వచ్చారు. ఇటీవల అమీన్‌పూర్‌, తెల్లాపూర్‌, ఐడీఏ బొల్లారం మున్సిపల్‌ ప్రాంతాలు సీఎంసీలో విలీనం కావడంతో పరిపాలనా మార్పులకు అనుగుణంగా ఎకై ్సజ్‌ శాఖ కూడా నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో పటాన్‌చెరు కేంద్రంలో ఉన్న అబ్కారీ స్టేషను రద్దు చేసి, అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిని మాదాపూర్‌ అబ్కారీ స్టేషన్‌కు బదిలీ చేసింది. అమీన్‌పూర్‌లో ఉన్న అబ్కారీ స్టేషన్‌కు ‘పటాన్‌చెరు అబ్కారీ స్టేషన్‌’గా పేరు మార్చి నియోజకవర్గ కేంద్రంగా కొనసాగుతుంది. ఇక పటాన్‌చెరు ఎకై ్సజ్‌ స్టేషన్‌కు శేరిలింగంపల్లి ఎకై ్సజ్‌ సీఐకు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు.

పరిధుల్లోనూ మార్పులు...

ఇంద్రేశం, ఇస్నాపూర్‌ మున్సిపాలిటీలతోపాటు భానూర్‌, నందిగామ, క్యాసారం గ్రామ పంచాయతీలను సంగారెడ్డి అబ్కారీ స్టేషన్‌ పరిధిలోకి చేర్చారు. గుమ్మడిదల, జిన్నారం మున్సిపాలిటీలను ఆందోల్‌ ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలోకి మార్చారు. సీఎంసీలో విలీనమైన తెల్లాపూర్‌, కొల్లూర్‌, ఉస్మాన్‌నగర్‌, ఈదుల నాగులపల్లి ప్రాంతాన్ని గండిపేట అబ్కారీ స్టేషన్‌ పరిధిలోకి తీసుకువచ్చారు. పటాన్‌చెరు, రామచంద్రపురం, అమీన్‌పూర్‌, బొల్లారంలను పటాన్‌చెరు ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలోకి తీసుకువచ్చారు. కొత్త సరిహద్దులకు అనుగుణంగా అబ్కారీ శాఖ చేపట్టిన ఈ మార్పులతో పరిపాలనా నిర్వహణ, పర్యవేక్షణ మరింత సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

నాలుగు స్టేషన్ల పరిధిలో పటాన్‌చెరు నియోజకవర్గం

ఎకై ్సజ్‌ స్టేషన్‌ ఇన్‌చార్జిగా

శేరిలింగంపల్లి ఎకై ్సజ్‌ సీఐ

పటాన్‌చెరు అబ్కారీ సిబ్బంది మాదాపూర్‌కు బదిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement