జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలోని రంజోల్ సంగమేశ్వర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మునిగుప్త బుధవారం ప్రకటనలో వెల్లడించారు. స్పాట్ అడ్మిషన్ కోసం ఈ నెల 3 తేదీ సాయంత్రం 4 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 4వ తేదీ స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ చేపడతామని ఉదయం 8 గంటలకే రంజోల్ కళాశాలలోని డీహెచ్–2 హాల్‌లో జరిగే కౌన్సెలింగ్‌కు నేరుగా హాజరుకావాలని సూచించారు. ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుందన్నారు. అడ్మిషన్ తీసుకున్న అభ్యర్థులు అర్హతను బట్టి రూ.5,080 ట్యూషన్ ఫీజు, రూ.1.710 ఇతర ఫీజులు కోసం నగదు చెల్లించాలని చెప్పారు.


