రామచంద్రాపురం(పటాన్‌చెరు): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై బీఎల్‌ఏలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ సూచించారు. రామచంద్రాపురం పట్టణంలోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై బీఎల్‌ఎలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూత్‌స్థాయి నుంచి ప్రతీ ఒక్కరు సర్‌పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రతీ ఇంటికి వెళ్లి ఓటర్లు ఉన్నారా లేదా అని పరిశీలించాలని సూచించారు. అర్హులైన ప్రతీ ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. 2002 ఓటర్ల డేటా మ్యాపింగ్, ఓటరుల జాబితా సవరణలో అనుసరించాల్సిన ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై ఆయన క్షుణంగా వివరించారు. ఇందులో సాంకేతిక లోపాలున్నాయని దీనిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల, మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ నీలం మధు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా, మాజీ కార్పొరేటర్ బి.పుష్ప, మాజీ కౌన్సిలర్ కె.భరత్ పాల్గొన్నారు.
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్


