పారదర్శకంగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా చేపట్టాలి

Jul 2 2026 6:55 AM | Updated on Jul 2 2026 6:55 AM

జహీరాబాద్‌ టౌన్‌: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపట్టాలని ఎమ్మెల్యే మాణిక్‌రావు స్పష్టం చేశారు. మొగుడంపల్లి మండలంలోని జాడిమల్కాపూర్‌ గ్రామంలో సర్‌ ప్రక్రియను ఎమ్మెల్యే బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఎన్యూమరేషన్‌ ఫారాలు అందరికీ అందేలా చూడాలని, నిర్ణీత గడువులోగా సమర్పించేలా పార్టీ బూత్‌ లెవల్‌ ఏజెంట్లను కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తట్టు నారాయణ, సంజీవ్‌రెడ్డి, సర్పంచ్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

మొగుడంపల్లి మండలంలోని విట్టునాయక్‌ తండా, జాడిమల్కాపూర్‌లలో మాణిక్‌రావు సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. రూ. 5 లక్షల చొప్పున రూ.10 లక్షలతో నూతన సీసీ రోడ్డును నిర్మించనున్నారు. భూమి పూజ చేసిన ఎమ్మెల్యే త్వరగా పనులు పూర్తి చేయాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement