వ్యవసాయ కార్మిక శాఖ సంఘం
జిల్లా అధ్యక్షుడు రాంచందర్
ఝరాసంగం(జహీరాబాద్): వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ పథకం చట్టాన్ని అమలు చేయాలని వ్యవసాయ కార్మిక శాఖ సంఘం జిల్లా అధ్యక్షుడు బి.రాంచందర్ డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామంలో నిరసన వ్యక్తం చేసి, పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉపాధి హామీ చట్టాన్ని ఉద్దేశపూర్వకంగానే మోదీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. కొత్త చట్టంలో ఏడాదికి 100 రోజుల పని ఇవ్వాలనే నిబంధనేదీ లేదని ఆందోళన వ్యక్తం చేశారు.


