త్వరలో రానున్న నోటిఫికేషన్!
ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తామని గతంలోనే ప్రకటించి చర్యలు చేపట్టడంతో ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం పోలింగ్ బూత్‌ల వివరాలు, బూత్ ఇన్‌చార్జీల జాబితాను ఎన్నికల అధికారులకు అప్పగించినట్లు తెలుస్తుంది. ఫస్ట్ నోటీస్ రెండు మూడు రోజుల్లో వెలువరించేందుకు కార్మిక శాఖ కసరత్తు ప్రారంభించింది. గుర్తింపు సంఘం ఎన్నికల అనంతరం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ మొదలు కానుంది.
బ్యాలెట్ విధానంలో ఎన్నికలు
ఆర్టీసీలో కార్మికశాఖ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను చేపడుతుంది. కార్మిక శాఖ అధికారులు ఎన్నికల అధికారులుగా హాజరవుతారు. రాష్ట్ర, రీజియన్, డిపో స్థాయిలో కార్యదర్శుల పేర్లను ఆయా యూనియన్లు ప్రకటిస్తాయి. కార్మికులు బ్యాలెట్ విధానంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. డిపోలో ఆయా కార్మిక సంఘాలు తమ తమ గుర్తుల ద్వారా కార్మికులకు ప్రచారం నిర్వహిస్తారు. పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాలెట్ ద్వారా రహస్య ఓటింగ్ జరుగుతుంది. రాష్ట్ర , రీజియన్ స్థాయికి ఒకటి చొప్పున ఆయా సంఘాలకు ఒక కార్మికుడు రెండు ఓట్లు, పోటీలో ఉన్న యూనియన్ల గుర్తులపై వేయాలి. సదరు డిపోలో ఎక్కువ ఓట్లు ఏ యూనియన్‌కు వస్తే ఆ నేతను డిపో కార్యదర్శిగా ఎన్నుకుంటారు. రీజియన్ పరిధిలోని 8 డిపోల్లో.. ఏ యూనియన్‌కు అధిక్యత వస్తే రీజియన్ కార్యదర్శిగా సదరు యూనియన్ నేత ఎన్నికవుతారు. అలాగే రాష్ట్ర స్థాయిలో అన్ని రీజియన్ల పరిధిలో వచ్చిన మెజార్టీ ఆధారంగా సదరు యూనియన్ నేతను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికై న యూనియన్ కార్యదర్శి డిపో, రీజియన్, రాష్ట్ర స్థాయిలో కార్మికుల పక్షాన సమస్యల పరిష్కారానికికృషి చేస్తారు.
రీజియన్‌లో 1,950..
మెదక్ రీజియన్ పరిధిలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, దుబ్బాక, నర్సాపూర్, గజ్వేల్– ప్రజ్ఞాపూర్ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో రెగ్యూలర్ కండక్టర్లు 1,014, డ్రైవర్లు 508, మెకానిక్‌లు, ఏడీసీ, సూపర్‌వైజర్లు, డీఎం ఆఫీస్ స్టాఫ్ తదితరులు కలిపి 428 మంది, మొత్తం రెగ్యులర్ కార్మికులు 1,950మంది కొనసాగుతున్నారు. మెదక్ రీజియన్‌లో ప్రధానంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ), భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్), ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) ప్రధాన యూనియన్లుగా ఉండగా వీటితోపాటు మరికొన్ని యూనియన్లు కూడా ఉన్నాయి.
చర్యలు చేపట్టిన ఆర్టీసీ, కార్మిక శాఖ
రీజియన్ పరిధిలో
8 డిపోలు, 1,950 మంది కార్మికులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీ ఆర్టీసీ)లో యూనియన్ ఎన్నికల నగారా మోగనుంది. రెండు రోజుల్లో నోటిఫికేషన్ సైతం విడుదల చేయనున్నారు. యూనియన్ ఎన్నికలపై ఉద్యోగుల్లో నెలకొన్న ఉత్కంఠకు, అనుమానాలకు తెర దించుతూ యాజమాన్యం ఎన్నికలకు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ అధికారిగా జాయింట్ లేబర్ కమిషనర్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన ఆర్టీసీ యాజమాన్యంతో బేటీ అయి ఎన్నికల నిర్వహణ వివరాలు తెలుసుకున్నారు. యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించనున్నారు.
నారాయణఖేడ్


